మేక్ ఇన్ ఇండియా వేదికపై బహ్రెయిన్, ఇండియా ప్రముఖులు
- February 26, 2016
బహ్రెయిన్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న డెలిగేషన్ బృందం, అలాగే బహ్రెయిన్ ఇండియా సొసైటీ ప్రముఖులు బహ్రెయిన్ సామర్థ్యాన్ని, 'మేక్ ఇన్ ఇండియా షో' వేదిక సాక్షిగా భారత ప్రముఖులతో పంచుకున్నారు. భారత ప్రధాని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌కి తమ వంతు సహకారం అందిస్తామని బహ్రెయిన్ డెలిగేషన్ వెల్లడించింది. దాదాబాయ్ మరియు బిఐఎస్ ఫౌండర్ అబ్దుల్ నబీ అల్ షోఅలా, ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన్‌లో పెట్టుబడులు పెడుతున్న ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన 40 మంది ప్రముఖ బిజినెస్ లీడర్స్‌ని కూడా ఆయన తన వెంట తీసుకువెళ్ళారు. పరుగులు పెడుతున్న భారత ఆర్థిక వ్యవస్థను చూసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉందని దాదాబాయ్ చెప్పారు. భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ఇదే సరైన సమయం అనీ, భారతీయ కంపెనీలు గల్ఫ్ దేశాల వైపు దృష్టి సారిస్తుండడం అభినందనీయమనీ పలువురు వ్యాఖ్యానించారు. భారతీయ కంపెనీలు, బిజినెస్ లీడర్స్ బహ్రెయిన్ ఎకనమిక్ పాలసీల పట్ల ఆకర్షితులై ఉన్నారని దాదాబాయ్ చెప్పారు. ఇరు దేశాలూ మంచి అవగాహనతో ముందుకు వెళ్తాయనీ, పరస్పరం వివిధ రంగాల్లో సహకారం అందించుకోవాల్సి ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







