సుల్తాన్ కబూస్ విశ్వవిద్యాలయ విద్యార్ధులకు ఏర్పడనున్న బస్సు సౌకర్యం
- February 26, 2016
అల్ ఖౌద్ ప్రాంతంలో నివసిస్తున్న సుల్తాన్ కబోస్ విశ్వవిద్యాలయ విద్యార్ధులు కొంత సొమ్మును ఆదా చేసుకొనే అవకాశం త్వరలో ఏర్పడనుంది. ఒమాన్ జాతీయ రహదారి సంస్థ ఈ ప్రాంతం నుంచి విశ్వవిద్యాలయం వరకు బస్సు సేవలను విద్యార్ధుల కోసం ప్రారంభించనుంది. కారు లేని పలువురు విద్యార్ధులు నిత్యం ఈ మార్గంలో టాక్సీల పైనే ఆధారపడాల్సి వచ్చేది. ఇందుకు కిరాయిగా రోజూ కనీసం ఒక రియల్ ను ఖర్ఛు చేయాల్సివస్తుందని విద్యార్ధి సమాఖ్య నేత నసీర్ అల్ హనై వాపోయారు. గతంలో కిరాయి టాక్సీలకు 200 బైసాస్ చెల్లించేవారు ఇంధన ధరలు పెరిగిన కారణంగా ప్రస్తుతం టాక్సీ డ్రైవర్లు 500 బైసాస్ ను అడుగుతున్నారని తెలిపారు. 2016 నాల్గోవ నెలలో ( ఏప్రిల్ ) మ్వసలట్ సంస్థ తన బస్సు సేవలను అల్ ఖౌద్ ప్రాంతం నుంచి సుల్తాన్ కబోస్ విశ్వవిద్యాలయం వరుకు కొనసాగించనుంది. ఈ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో మారు ఈ బస్సులు నడవనున్నాయి. విద్యార్ధి సమాఖ్య ఈ ప్రాంతంలో ఒక అధ్యయనం నిర్వహించి అత్యంత సురక్షవంతమైన ఈ మార్గాన్ని మ్వసలట్ సంస్థను ఎంపిక చేసింది.సుల్తాన్ కబోస్ విశ్వవిద్యాలయ విద్యార్ధులు తమ తమ గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని మ్వసలట్ సంస్థ కోరింది.సాధారణ ప్రయాణికులు ఈ ఏడాది మొదటి 70 రోజులలో మ్వసలట్ సంస్థ బస్సుల ద్వారా 600,000 మంది ప్రయాణించారు. ఈ మార్గంలో రోజుకు సగటున 9 వేల మంది ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరుకోంటూ ఉంటారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







