సుల్తాన్ కబూస్ విశ్వవిద్యాలయ విద్యార్ధులకు ఏర్పడనున్న బస్సు సౌకర్యం

- February 26, 2016 , by Maagulf
సుల్తాన్ కబూస్ విశ్వవిద్యాలయ విద్యార్ధులకు  ఏర్పడనున్న బస్సు సౌకర్యం

అల్ ఖౌద్ ప్రాంతంలో నివసిస్తున్న సుల్తాన్ కబోస్  విశ్వవిద్యాలయ విద్యార్ధులు కొంత సొమ్మును ఆదా చేసుకొనే అవకాశం త్వరలో ఏర్పడనుంది. ఒమాన్ జాతీయ రహదారి సంస్థ ఈ ప్రాంతం నుంచి విశ్వవిద్యాలయం వరకు బస్సు సేవలను విద్యార్ధుల కోసం ప్రారంభించనుంది. కారు లేని పలువురు విద్యార్ధులు నిత్యం ఈ మార్గంలో టాక్సీల పైనే ఆధారపడాల్సి వచ్చేది. ఇందుకు కిరాయిగా రోజూ కనీసం ఒక రియల్ ను ఖర్ఛు చేయాల్సివస్తుందని విద్యార్ధి సమాఖ్య నేత నసీర్ అల్ హనై వాపోయారు. గతంలో కిరాయి టాక్సీలకు 200 బైసాస్ చెల్లించేవారు ఇంధన ధరలు పెరిగిన కారణంగా ప్రస్తుతం టాక్సీ డ్రైవర్లు  500 బైసాస్ ను  అడుగుతున్నారని తెలిపారు. 2016 నాల్గోవ నెలలో ( ఏప్రిల్ ) మ్వసలట్ సంస్థ తన  బస్సు సేవలను అల్ ఖౌద్ ప్రాంతం నుంచి  సుల్తాన్ కబోస్  విశ్వవిద్యాలయం వరుకు కొనసాగించనుంది.  ఈ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో మారు ఈ బస్సులు నడవనున్నాయి. విద్యార్ధి సమాఖ్య ఈ ప్రాంతంలో ఒక అధ్యయనం నిర్వహించి అత్యంత సురక్షవంతమైన ఈ మార్గాన్ని మ్వసలట్ సంస్థను ఎంపిక చేసింది.సుల్తాన్ కబోస్  విశ్వవిద్యాలయ విద్యార్ధులు తమ తమ గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని మ్వసలట్ సంస్థ కోరింది.సాధారణ ప్రయాణికులు ఈ ఏడాది మొదటి 70 రోజులలో మ్వసలట్ సంస్థ బస్సుల ద్వారా 600,000 మంది ప్రయాణించారు. ఈ మార్గంలో రోజుకు సగటున 9 వేల మంది ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు చేరుకోంటూ ఉంటారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com