గల్ఫ్ కార్మికుల వేతన పోరాటం...
- February 22, 2021
తెలంగాణ:గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను (మినిమమ్ రిఫరల్ వేజెస్) ను తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్లను రద్దు చేసి, పాత వేతనాలను కొనసాగించాలని గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.
రెండు నెలల క్రితం ఇదే విషయంపై తాము సమర్పించిన వినతి పత్రం పై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని సమాచార హక్కు చట్టం క్రింద దరఖాస్తు సమర్పించారు.
గల్ఫ్ జెఏసి ఆధ్వర్యంలో నిర్మల్ లో స్వదేశ్ పరికిపండ్ల, కరీంనగర్ లో మైదం శ్రీనివాస్, సిరిసిల్లలో తోట ధర్మేందర్, జనగామ శ్రీనివాస్ నాయకత్వంలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు.
కొత్తగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి కనీస వేతనాలు (మినిమమ్ రిఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం అయిదు నెలల క్రితం సెప్టెంబర్ 2020 లో రెండు సర్కులర్లు జారీ చేసింది.ఖతార్, బహ్రెయిన్, ఓమాన్, యుఎఇ దేశాలకు వెళ్లే కార్మికుల నెలసరి వేతనాలను 200 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 5 వేలు), కువైట్ (245 డాలర్లు), సౌదీ అరేబియా (324 డాలర్లు) కు తగ్గిస్తూ భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
ఈ సర్కులర్ల ప్రకారం అన్ని క్యాటగిరీలను ఒకేగాటన కట్టి కార్మికులకు, వృత్తి నిపుణులకు కనీస వేతనం ఒకే విధంగా నిర్ణయించడం వలన తీవ్ర అన్యాయం జరుగుతున్నదని రవిగౌడ్ అన్నారు. ఈ-మైగ్రేట్ వెబ్ సైటులో అలవెన్సులు గురించి 'నాట్ అవేలబుల్' (సమాచారం అందుబాటులో లేదు) అని పెట్టారు. జీతాలు అమలయ్యే తేదీని 26.06.2015 అని ఐదేళ్ల నాటి పాత డేటు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్చలు, అధ్యయనం చేపట్టకుండా ఏకపక్షంగా ఒక్క కలం పోటుతో జీతాలు తగ్గించడం భారత్ ను 'చీప్ లేబర్' (తక్కువ జీతానికి పనిచేసే కార్మికులు) అడ్డాగా మార్చడమే. ఇది మానవ హక్కుల, కార్మిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇది వెట్టిచాకిరి, బానిసత్వానికి దారి తీస్తుందని రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
మార్చిలో ఛలో ఢిల్లీ...
పార్లమెంటు రెండవ విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 8 నుండి ప్రారంభం అవుతున్న సందర్బంగా గల్ఫ్ జెఏసి ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లి ఎంపీలను, కేంద్ర విదేశాంగ మంత్రి డా.ఎస్. జైశంకర్ ను కలిసి కనీస వేతనాల తగ్గింపు సర్కులర్లను రద్దు చేయాలని కోరుతామని రవిగౌడ్ తెలిపారు. ఈ సర్కులర్ల వలన ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 90 లక్షల మంది భారతీయ కార్మికుల ఆదాయంపై ప్రభావం పడుతుందని, సమస్య తీవ్రతను వివరిస్తామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







