డిజిటైజేషన్: అన్ని సర్వీస్ సెంటర్లను మూసివేసిన యూఏఈ మినిస్ట్రీ

- February 22, 2021 , by Maagulf
డిజిటైజేషన్: అన్ని సర్వీస్ సెంటర్లను మూసివేసిన యూఏఈ మినిస్ట్రీ

యూఏఈ:యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ, తమ విభాగానికి సంబంధించిన అన్ని సర్వీస్ సెంటర్లను డిజిటైజేషన్ ప్రక్రియ నేపథ్యంలో మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విభాగాల్ని డిజిటైజ్ చేసే క్రమంలో కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లను మూసివేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. 2021 జనవరిలో యూఏఈ మినిస్టీరియల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, 50 శాతం ఫెడరల్ గవర్నమెంట్ సర్వీస్ సెంటర్ల తగ్గింపు దిశగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండేళ్ళలోపు వీటిని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌గా మార్చాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. తొలి ఫేజ్‌లో మొత్తం 282 సర్వీసు సెంటర్లను డిజిటైజ్ చేస్తారు. వీటిల్లో 59 సెంటర్లను 2021 తొలి క్వార్టర్‌లోనే మార్చుతారు. మిగిలినవన్నీ 2021-2022లో మూసివేయడం జరుగుతుంది. దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ కూడా తమ కస్టమర్ కేర్ సెంటర్‌ను (డ్రాగన్ మార్ట్ 2 వద్ద) మూసివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com