తెలంగాణలో ప్రస్తుతం కర్ఫ్యూ విధించే ఆలోచన లేదు:మంత్రి రాజేందర్

- February 22, 2021 , by Maagulf
తెలంగాణలో ప్రస్తుతం కర్ఫ్యూ విధించే ఆలోచన లేదు:మంత్రి రాజేందర్

హైదరాబాద్:భారత దేశంలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో పూర్తి స్థాయిలో పాజిటివ్‌ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పలు రాష్ట్రాల్లో తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటున్నట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎలాంటి కర్ఫ్యూ విధించే ఆలోచన లేదన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లోకరనా కేసులు పెరుగుదలపై రాష్ట్ర వైద్య శాఖ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, దీంతో తెలంగాణలో వైరస్‌ కట్టడే లక్ష్యంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. గాంధీ, నిమ్స్‌ ఆస్పత్రుల్లో మళ్లీ పటిష్ట ఏర్పాట్లు చేస్తామన్నారు. అయితే కరోనా విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు తప్పకుండా ధరించాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 లక్షలకుపైగా వ్యాక్సిన్‌ డోసులు వచ్చాయని, 50 ఏళ్లు దాటిన, దీర్ఘకాలిక వ్యాధులున్వారికి త్వరగా వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నారు. నాణ్యమైన మందుల కోసం బడ్జెట్‌లో నిధులు పెంచుతున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com