హ్యాకర్‌ల భారిన పడకుండా ఉండేందుకు ఏం చెయ్యాలంటే?

- February 22, 2021 , by Maagulf
హ్యాకర్‌ల భారిన పడకుండా ఉండేందుకు ఏం చెయ్యాలంటే?

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ ఉండగా.. వాట్సాప్‌ను హ్యాక్ చేసి తప్పుడు మెసేజ్‌లతో ఇబ్బంది పెట్టడం చూస్తూనే ఉన్నాం..కొందరు చేస్తోన్న పని వాట్సాప్ యూజర్లకు చికాకుగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అనేకమంది యూజర్లు డబ్బులు కోల్పోయిన పరిస్థితి కూడా కనిపించింది.

వెబ్‌సైట్స్, సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేసే కేటుగాళ్లు.. వాట్సాప్‌ను ఎలా హ్యాక్ చేస్తున్నారనేదానిపై మాత్రం స్పష్టత రాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎమర్జెన్సీ మెసేజ్‌ల పేరుతో పలువురికి వాట్సప్ సందేశాలు పంపించి.. గుర్తు తెలియని వ్యక్తులు వారి చాట్‌ను హ్యాక్ చేశారు. బాధితుల్లో పలువురు సెలబ్రిటీలు, డాక్టర్లు ఉన్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం అయ్యింది.

 సైబర్‌ నేరగాళ్లు వారి కాంటాక్ట్‌లో ఉన్న నంబర్ల నుంచి మెసేజ్‌లు పంపించి, 'ఎమర్జెన్సీ హెల్ప్‌' అంటూ సిక్స్ డిజిట్ కోడ్‌తో ఎస్‌ఎంఎస్‌లు పంపించి.. చాట్‌ను హ్యాక్ చేస్తారు. మొదట ఒక వ్యక్తి వాట్సాప్‌ ఖాతా హ్యాక్ అవుతుంది. ఆ తర్వాత ఆ మొబైల్ నెంబర్ నుంచి అతడి ఫ్రెండ్ లిస్టులో ఉన్న వారందరికీ ఒక మెసేజ్ వెళ్తుంది. మీకు పొరపాటున ఆరు అంకెల కోడ్‌ను పంపాను. మీరు ఆ కోడ్‌ను తిరిగి పంపించండి ప్లీజ్. చాలా అర్జెంట్ అంటూ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత కాంటాక్ట్స్‌లోని వారందరి ఫోన్లకు SMS వస్తుంది. అందులో ఆరంకెల కోడ్‌తో పాటు ఒక లింక్ కూడా ఉంటుంది. ఆ కోడ్‌ను వాట్సాప్ ద్వారా పంపించినా.. లింక్ క్లిక్ చేసినా.. వాట్సప్ క్రాష్ అవుతుంది.

అయితే, అటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు క్రొత్త పరికరంలో వాట్సాప్‌ను సెటప్ చేస్తున్నప్పుడు సిమ్ కార్డును ధృవీకరించే కోడ్ మీకు లభిస్తుంది. OTP మీకు SMS ద్వారా లేకపోతే.. వాట్సాప్ లేదా కాల్ ద్వారా వస్తుంది. వాట్సప్ పాస్‌కోడ్ పెట్టుకోవడం ద్వారా మీరు హ్యాకింగ్ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు.

పాస్‌కోడ్ ఎలా పెట్టుకోవాలంటే.. మొదటగా.. WhatsApp Settings ఓపెన్ చెయ్యాలి.Tap Account-->Two-step verification-->Enable.ఆరు అంకెల నెంబర్ పెట్టుకోవాలి.మరొక్కసారి నిర్థారించుకోవాలి.ఈమెయిల్ అడ్రెస్ యాడ్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు.లేకపోతే వదిలేయవచ్చు.తర్వాత సేవ్ చేసుకోవచ్చు.తద్వారా మీ వాట్సప్ హ్యాకర్‌ల భారిన పడకుండా సేఫ్‌గా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com