కోవిడ్ ఎఫెక్ట్ : పది దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన ఒమన్
- February 23, 2021
ఒమన్: కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్న ఒమన్ సుప్రీం కమిటీ..లేటెస్ట్ పది దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న లెబనాన్, సుడాన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, నైజీరియా, టాంజానియా, గినియా, ఘనా, సియెర్రా లియోన్, ఇథియోపియా దేశాల నుంచి నేరుగా ఒమన్ ప్రయాణించటంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు..ట్రావెల్ బ్యాన్ జాబితాలో ఉన్న ఆ పది దేశాల మీదుగా ప్రయాణించేవారైనా, ఇటీవలి కాలంలో ఆ దేశాల్లో పర్యటించినా కూడా ఒమన్ కు రావటానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ట్రావెల్ బ్యాన్ దేశాల మీదుగా ప్రయాణించే వారు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్ లో ఉన్న తర్వాతే ఒమన్ కు అనుమతిస్తామని సుప్రీం కమిటీ తెలిపింది. అయితే..ఒమన్ పౌరులు, దౌత్యవేతలు, అధికార పర్యటనల నిమిత్తం ప్రయాణం చేసే వారు, వైద్య రంగంలో సేవలు అందిస్తున్న ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు మాత్రం ట్రావెల్ బ్యాన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. వచ్చే గురువారం నుంచి రెండు వారాల పాటు నిషేధం అమలులో ఉంటుందని, ఆ తర్వాత అప్పటి పరిస్థితులను సమీక్షించి ట్రావెల్ బ్యాన్ దేశాల జాబితాను సవరిస్తామని కమిటీ వివరించింది. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు..దేశ ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప విదేశీ ప్రయాణాలు చేయవద్దని కమిటీ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







