రెసిడెన్సీ ట్రేడింగ్: కువైట్ వ్యక్తి 15ఏళ్లు, 8 మంది ప్రవాసీయులకు 10 ఏళ్ల జైలు శిక్ష

- February 23, 2021 , by Maagulf
రెసిడెన్సీ ట్రేడింగ్: కువైట్ వ్యక్తి 15ఏళ్లు, 8 మంది ప్రవాసీయులకు 10 ఏళ్ల జైలు శిక్ష

కువైట్: మంచి ఉద్యోగం, అంతకంటే మంచి జీతం. కొన్ని డబ్బులు కట్టి కువైట్ ప్రయాణమైతే మీ కష్టాలన్ని ఆర్నెళ్లలో తీరిపోతాయి. రెండు మూడేళ్లు కష్టపడితే కుటుంబం మొత్తం సుఖంగా బతకొచ్చు. ఇలాంటి మాయమాటలు చెప్పి అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఓ ముఠా పాపం పండింది. వివధ దేశాల నుంచి వచ్చిన ప్రవాసీయులను చేరదీసి కువైట్ కు చెందిన ఓ కంపెనీ మేనేజర్ గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ఉద్యోగాల కోసం ఎదురు చస్తున్న వాళ్లను, కష్టాల్లో ఉన్న వాళ్లను టార్గెట్ గా చేసుకొని..ఉద్యోగం పేరుతో వారికి మాయమాటలు చెప్పి కువైట్ రప్పించటం ప్రవాసీయుల పని. ఉద్యోగం చూపించినందుకు కొంత మొత్తం, పాస్ పోర్ట్, వీసా ఖర్చులకు మరికొంత డబ్బు, విమాన ప్రయాణాల కోసం అంటూ బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తారు. ఇందుకోసం ఆయా దేశాల్లో ఏజెంట్లను మేనేజ్ చేస్తుంటారు. డబ్బులు తీసుకొని విజిట్ వీసా మీద కువైట్ వరకు తీసుకొచ్చి వారిని నిర్దాక్ష్యన్యంగా వదిలేస్తారు. ముందుగా హామీ ఇచ్చిన ఉద్యోగం ఉండదు, ఎక్కడికి వెళ్లాలో తెలియదు. తీరా బాధితుడికి విషయం అర్ధమయ్యే సరికి ఎటు పాలుపోని గందరగోళంలో ఇరుక్కొవాల్సి వస్తోంది. కొందరు సరైన డాక్యుమెంట్లు లేక జైలు పాలవుతారు. ఇంకొందరు తిరిగి తమ దేశం వెళ్లే మార్గం లేక, వేళ్లేందుకు డబ్బులు లేక ఏదో ఒక ఉద్యోగంలో చేరి ఓ బానిసలా బతుకీడుస్తుంటారు. ఓ మనిషి జీవితంతో ఇంత నిర్దాక్ష్యణ్యంగా చెలగాటమాడుతూ రెసిడెన్సీ ట్రేడింగ్ చేయటమే ఈ పాపిష్టి ముఠా బిజినెస్. డబ్బుల కోసం కొందరు అభాగ్యుల్ని బలిపశువుల్ని చేసి..వారి కుటుంబాలకు కూడా తీరని క్షోభకు గురిచేస్తున్న ముఠాకు తగిన శిక్ష పడింది. పలువురి విదేశీయుల్ని కువైట్ రప్పించి మోసం చేసిన కేసులో కువైట్ కు చెందిన కంపెనీ మేనేజర్ కు 15 ఏళ్ల కఠిన కారగార శిక్ష విధించింది క్రిమినల్ కోర్టు. కువైట్ వ్యక్తికి సహకరించిన 8 మంది ప్రవాసీయులకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com