దుబాయ్ ఎయిర్ పోర్టులో ఫాస్ట్ ట్రాక్ పాస్ పోర్టు సర్వీస్..5 సెకండ్లలో క్లియరెన్స్

- February 23, 2021 , by Maagulf
దుబాయ్ ఎయిర్ పోర్టులో ఫాస్ట్ ట్రాక్ పాస్ పోర్టు సర్వీస్..5 సెకండ్లలో క్లియరెన్స్

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక నుంచి పాస్ పోర్టు క్లియరెన్స్ కోసం భారీ క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. కేవలం 5 సెకన్లలోనే పాస్ పోర్టు క్లియరెన్స్ ప్రాసెస్ పూర్తి కానుంది. ఇందుకోసం విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ పాస్ పోర్ట్ క్లియరెన్స్ సర్విస్ ను అందుబాటులోకి తెస్తూ బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ టెక్నాలజీలో ప్రయాణికులు బయోమెట్రిక్ మెషిన్ ముందు నిల్చోగానే వారి ముఖం, కంటిలోని ఐరిస్ ను మెషిన్ గుర్తించి వారి పాస్ పోర్టు వివరాలను క్రోడకరించుకుంటుంది. వివరాలన్ని సజావుగా ఉంటే కేవలం 5 సెకన్ల నుంచి గరిష్టం 9 సెకన్లలోపు క్లియరెన్స్ ఇస్తుంది. ప్రయాణికులు బయల్దేరు టెర్మినల్ దగ్గర బయోమెట్రిక్ స్మార్ట్ గేట్లను ఏర్పాటు చేశారు. అయితే..పాస్ పోర్టు ఫాస్ట్ ట్రాక్ సర్వీస్ క్లియరెన్స్ కు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని రెసిడెన్సీ, ఫారెన్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు బోర్డింగ్ పాస్ ప్రాసెస్ పూర్తి చేసుకొని స్మార్ట్ గేట్ ద్వారా ఎంట్రీకి ప్రీ రిజిస్టర్ చేసుకొని ఐరిష్ చెకింగ్ ద్వారా సెకన్ల వ్యవధిలోనే పాస్ పోర్ట్ క్లియరెన్స్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. బయోమెట్రిక్ పని విధానాన్ని విశ్లేషించేందుకు ఎయిర్ పోర్ట్ టర్మినల్ 3 దగ్గర ప్రయోగత్మాకంగా మీడియా ప్రతినిధులతో మీడియా టూర్ ఏర్పాటు చేశారు. ​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com