ప్రికాషనరీ మెజర్స్ పాటించని 15 వ్యాపారాల మూసివేత

ప్రికాషనరీ మెజర్స్ పాటించని 15 వ్యాపారాల మూసివేత

దోహా: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్అండ్ ఇండస్ట్రీ, పలు స్టోర్స్ మరియు ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. మినిస్ట్రీ విడుదల చేసిన ప్రికాషనరీ మెజర్స్ పాటించని కారణంగా ఈ చర్యలు తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో పబ్లిక్ మరియు ప్రైవేట్ రిక్వైర్‌మెంట్స్ పలు నిబంధనలు పాటించాలంటూ మినిస్ట్రీ సర్క్యులర్ గతంలోనే జారీ చేసిన సంగతి తెలిసిందే. గజెల్ బ్యూటీ సెంటర్ (అల్ గరాఫా), స్టెప్ ఎన్ స్టైల్ బ్యూటీ మరియు ఫిట్‌నెస్ సెంటర్ (అల్ వక్రా), రిటెయిల్ మార్ట్ కంపెనీ (అబా సలీల్), అల్ దార్ ఫర్ ఎక్స్‌ఛేంజ్ వర్క్స్ (అబా సలీల్), రెడ్ ఫోర్ట్ రెస్టారెంట్ (అబా సలీల్), దాకర్ కిచెన్ అండ్ రెస్టారెంట్ (అబా సలీల్), పా్యరిస్ హైపర్ మార్కెట్ (ఇండస్ట్రియల్ ఏరియా), రిలాక్స్ టైమ్ విమెన్స్ మసాజ్ (అల్ ఖరైతియాత్), లేడీ జిమ్ బ్యూటీ మరియు స్పా (అల్ ఖరైతియాత్), వీనస్ హైపర్ మార్కెట్ (ఇండస్ట్రియల్ ఏరియా) తదితర బిజినెస్‌లపై వేటు వేయడం జరిగింది. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, నిబంధనలు పాటించని ఎస్టాబ్లిష్‌మెంట్స్‌పై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Back to Top