హిందీలో రీమేక్ కానున్న ఉప్పెన!

హిందీలో రీమేక్ కానున్న ఉప్పెన!

బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉప్పెన' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తుంది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించారు. తొలి ప్రయత్నంలోనే దర్శకుడు, హీరో, హీరోయిన్ సక్సెస్ అవ్వడం పట్ల టాలీవుడ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సక్సెస్ ను రెండు తెలుగు రాష్ట్రాలంతటా ఎంజాయ్ చేస్తున్నారు చిత్రబృందం. కాగా ఈ సినిమా తమిళ రీమేక్ లో విజయ్ తనయుడు సంజయ్ రీమేక్ చేయనున్నాడని ఇటీవల కోలీవుడ్ లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే, ఇప్పుడు తాజాగా హిందీలోను రీమేక్ కానున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్‌లో ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా 'ఉప్పెన' రీమేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

Back to Top