లేపాక్షి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం
- February 26, 2016
అనంతపురం జిల్లా హిందూపురంలో లేపాక్షి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలకు కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి హాజరుకానున్నారు. లేపాక్షి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం 999 మంది కళాకారులతో శోభాయాత్రను నిర్వహించనున్నారు. లేపాక్షి ఉత్సవ ఏర్పాట్లను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ ఉత్సవాలకు హాజరుకావాలంటూ నందమూరి బాలకృష్ణ న్యూఢిల్లీలోని పలువురు కేంద్రమంత్రులను కలసి స్వయంగా ఆహ్వాన పత్రాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం రూ.4.20 కోట్ల నిధులు కేటాయించిన విషయం విదితమే. లేపాక్షి ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







