బైడెన్ మరో కీలక నిర్ణయం.. గ్రీన్ కార్డు అప్లికేషన్స్‌పై నిషేధం ఎత్తివేత
- February 25, 2021అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్‌కార్డు అప్లికేషన్స్‌పై ఉన్న నిషేధం ఎత్తివేశారు. ట్రంప్ విధించిన బ్యాన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో వేలాది భారతీయులతో పాటు గ్రీన్ కార్డ్ ఆశించే విదేశీయులకు కొత్త అవకాశాలు రానున్నాయి. అమెరికాలో నివసిస్తోన్న ప్రతీ భారతీయుడి అతి పెద్ద డ్రీమ్ గ్రీన్ కార్డు.
అమెరికాలో పౌరసత్వం అందించే ఈ గ్రీన్‌కార్డు కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. అమెరికాలో నివసిస్తూ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తోన్న వారికి బైడెన్ శుభవార్త చెప్పారు. బైడెన్ నిర్ణయంతో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు మేలు జరగనుంది. కరోనా సాకుతో గతేడాది ఏప్రిల్‌లో గ్రీన్ కార్డు ఆప్లికేషన్లను ట్రంప్ బ్యాన్ చేశారు. డిసెంబరు 31, 2020తో వరకు ఉన్న నిషేధాన్ని తర్వాత ట్రంప్ మార్చి 31వరకు పొడిగించారు. కరోనా ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న అమెరికా ఆర్థిక పరిస్థితిని కాపాడడం కోసం, యూఎస్ ఉద్యోగులను రక్షించడం కోసం ఇది అవసరమైన చర్య అని ట్రంప్ చెప్పారు.
దీంతో అమెరికాలో స్థిరపడి గ్రీన్ కార్డు కోసం ఎదరురుచూసే వారి ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లారు. ఈ నిర్ణయంపై అప్పట్లో బైడెన్ తీవ్ర విమర్శలు చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ కార్డు ఆప్లికేషన్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని హామి ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు