ఫస్ట్‌టైమ్ అలాంటీ పాత్రలో సమంత..
- February 25, 2021
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినీ ఇండస్ట్రీకి ఇప్పటికి 11 సంవత్సరాలు.. ఈ సందర్భంగా ఆమె తాజా చిత్రం శాకుంతలం గురించి అప్ డేట్ వచ్చింది. సమంత అక్కినేని తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతోంది. ప్రస్తుతం కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న సమంత వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది. అందులో భాగంగా సమంత అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్న ది ఫ్యామిలీ మ్యాన్ అనే పాపులర్ వెబ్ సిరీస్ రెండవ సీజన్‌లో కీలకపాత్రలో కనిపించనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమ్ కానుందని అమోజాన్ ప్రకటించింది. ఇక అది అలా ఉంటే ఆమె ఇటీవల గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాకు ఓకే చెప్పింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందని ఎప్పటినుంచో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చి 20 నుండి మొదలుకానుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలలోను విడుదల చేయనున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.
భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సమంత రెమ్యునరేషన్ భారీగానే తీసుకుంటుందనే టాక్. సమంత తన 11 ఏళ్ల కెరీర్ లో తొలిసారి పౌరాణిక పాత్రలో నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సెట్ వర్క్ జరుగుతోంది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







