దేవులపల్లి సాహితీ వైభవం
- February 25, 2021
పద్మభూషణ్ పురస్కార గ్రహీత కళాప్రపూర్ణ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి సాహితీ వైభవం అంతర్జాల కార్యక్రమంగా అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరిగింది. వంశీ ఇంటర్నేషనల్ ఇండియావారు 11 దేశాలలోని సాహితీవేత్తలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశం, అమెరికా, యు.కె., దక్షిణాఫ్రికా, సింగపూర్, హాంగ్‌కాంగ్, మలేషియా, మారిషస్, ఆస్ట్రేలియా, దోహా-ఖతార్, అబుధాభీ దేశాలనుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని దేవులపల్లివారి సాహితీ వైభవాన్ని కొనియాడారు. 1.11.1897లో జన్మించిన దేవులపల్లివారు 24.2.1980లో నిర్యాణం చెందారు. ఈ సందర్భంగా వంశీ వ్యవస్థాపకులు కళాబ్రహ్మ, శిరోమణి, డా॥ వంశీ రామరాజు మాట్లాడుతూ ‘‘1978లో దేవులపల్లివారిని సత్కరించామనీ, దేవులపల్లివారి పేరుమీద కాకతీయ విశ్వవిద్యాలయంలో స్వర్ణపతకాన్ని నెలకొల్పామనీ’’ గుర్తుచేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు అంతర్జాలంలో ప్రసారమైన ఈ కార్యక్రమం రాత్రి 10 గంటలవరకు కొనసాగింది. రెండుగంటలసేపు దేవులపల్లివారు రచించిన లలితగీతాలను వేదవతీప్రభాకర్, సురేఖామూర్తి, దివాకర్ల, శశికళాస్వామి వేదాల, హిమబిందు ఆలపించారు. దేవులపల్లివారి మనుమరాలు రేవతి అడితం అమెరికా నుంచి మాట్లాడుతూ ‘మా తాతగారు మరణించి 4 దశాబ్దాలైనా వారిని స్మరిస్తూ 1978 నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వంశీసంస్థకు నా అభినందనలు’ అన్నారు.


భారతదేశంనుంచి ప్రజానటి, కళాభారతి డా॥ జమునా రమణారావు, మండలి బుద్ధప్రసాద్, రేలంగి నరసింహారావు, సినీనటి పల్లవి, సినీ గేయరచయిత భువనచంద్ర, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఆచార్య వెలుదండ నిత్యానందరావు, డా॥ వోలేటి పార్వతీశం, డా॥ దామరాజు కామేశ్వరరావు, అమెరికానుంచి రత్న(పాప)కుమార్, డా॥ చిట్టెన్‌రాజు వంగూరి, డా॥ శారదాపూర్ణ శొంఠి, రాధికా నోరి, యు.కె. నుండి డా॥ జొన్నలగెడ్డ మూర్తి, సింగపూర్‌నుంచి రత్నకుమార్ కవుటూరు, సుబ్బు వి. పాలకుర్తి, హాంగ్‌కాంగ్‌నుంచి జయ పీసపాటి, ఆస్ట్రేలియా నుంచి సారథి మోటమర్రి, డా॥ యల్లాప్రెగడ రామకృష్ణారావు, దక్షిణాఫ్రికా నుంచి రాపోలు సీతారామరాజు, మలేషియానుంచి సత్యమల్లుల, దుర్గప్రియా గొట్టాపు, మారిషస్ నుంచి సంజీవ నరసింహ అప్పడు, నరైన్‌స్వామి సన్యాసి, ఖతార్ నుంచి తాతాజీ ఉసిరికల, కాళీబాబు దంటి, కల్యాణి కొండూరు, రామడుగు వేణుగోపాల, డా॥ వెంకట మాధవీలలిత జినుగు, అబుధాభీనుంచి చింతగుంట ఉదయపద్మ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ‘జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ’ అనే ప్రార్థనాగీతాన్ని అనఘదత్త రామరాజు, మరియు దేవులపల్లివారు రచించిన ‘ఘనాఘన సుందర’పాటను గుంటూరుకు చెందిన లక్ష్మీ శ్రీనివాస్ రామరాజు వీణపై శ్రావ్యంగా వినిపించారు. వంశీ అధ్యక్షురాలు డా॥ తెన్నేటి సుధ, వంశీ మేనేజింగ్ ట్రస్టీ శైలజ సుంకరపల్లి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ వంశీ గ్లోబల్ అవార్డ్స్ బహూకరిస్తున్నట్లు తెలియజేశారు.

తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







