భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్ (3-0)
- February 26, 2016
మూడో టి20లోనూ ఓడిన లంక రాంచీ: శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్ (3-0) చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన మిథాలీసేన... శుక్రవారం జరిగిన మూడో టి20లో 9 వికెట్ల తేడాతో నెగ్గింది. జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 89 పరుగులు చేసింది. కౌసల్య (25 నాటౌట్), జయాంగిణి (21), కంచన (17), హాన్సిక (13)లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు సాధించారు. ఏక్తా బిస్త్ 3, అనుజా 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. సృ్మతి మందన (43 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు), వనిత (25 బంతుల్లో 34; 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు.వేద కృష్ణమూర్తి (13 నాటౌట్) ఫర్వాలేదనిపించింది. మందనకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









