సేల్స్‌ అసిస్టెంట్‌ నుండి రెండు స్టోర్స్‌ ఓనర్‌గా

- February 27, 2016 , by Maagulf
సేల్స్‌ అసిస్టెంట్‌ నుండి రెండు స్టోర్స్‌ ఓనర్‌గా

ఖతార్‌లో సేల్స్‌ అసిస్టెంట్‌గా ప్రారంభమైన అతని జీవితం రెండు స్టోర్స్‌కి ఓనర్‌గా ఎదిగేస్థాయికి వెళ్ళింది. ఆయన ఎవరో కాదు, మహమ్మద్‌ మియా. పిర్‌ మహమ్మద్‌గా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 2006లో ఖతార్‌కి వచ్చాడు సేల్స్‌ అసిస్టెంట్‌గా పీర్‌ మహమ్మద్‌. క్లాత్‌ స్టోర్‌లో సేల్స్‌ అసిస్టెంట్‌గా జీవితం ప్రారంభించి, 2 పెర్ఫ్యూమహ్స స్టోర్స్‌కి ఓనర్‌గా ఎ దిగారు. ఆయన తన షాపుల్లో 14 మంది నేపాలీలకు ఉద్యోగావకాశాలు కల్పించారు. డాన్స్‌ ఇండియా డాన్స్‌ విన్నర్‌ తెరియా మగర్‌కి తన షాపుల్లో ఒకదాన్ని మియా బహుమతిగా ఇచ్చారు. క్లాత్‌ స్టోర్‌లో ఏడాదిపాటు ఉద్యోగం చేసిన తాను ఆ తర్వాత పెర్‌ఫ్యూమ్‌ స్టోర్‌లోకి ఉద్యోగిగా చేరాననీ, అక్కడ ఆ వ్యాపారినిక సంబంధించిన మెలకువల్ని రెండేళ్ళపాటు నేర్చుకున్నానని చెప్పారు మియా. ఆ తర్వాత తన స్పాన్సర్‌ సాద్‌ ఫలే అల్‌ హజ్రిని ఒప్పించి, రెండు పెర్ఫ్యూమ్స్‌ స్టోర్స్‌ని 2010లో ప్రారంభించారు. తన స్టోర్స్‌లో అమ్మే పెర్‌ఫ్యూమ్స్‌ను సహలియాలోని ఫ్యాక్టరీలోనే ఆయన తయారు చేయిస్తారు. నేపాల్‌లో గ్రాడ్యుయేట్‌ చేసి, అక్కడినుంచి విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనతో ఖతార్‌ చేరుకున్నారు. చిన్నప్పటినుంచీ పెర్ఫ్యూమ్స్‌ పట్ల తనకున్న ఆసక్తే ఈ రంగంలోకి వచ్చేలా చేసిందంటారాయన. వ్యాపారిగా ఎదగడమే కాకుండా నేపాల్‌ భూకంపం సంభవించినప్పుడు నేపాలీ పౌరుడిగా, ఆ దేశానికి తనకు తోచిన ఆర్థిక సహాయం చేసి భళా అనిపించుకున్నారు. అలాగే, గోర్ఖా వెల్ఫేర్‌ సొసైటీకి సలహాదారుగా పనిచేస్తున్నారు. నేపాల్‌లో ఈ సంస్థకు తగిన ఆర్థిక సహాయం చేస్తుంటారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com