చిరు మెగా యూత్ ఫోర్స్ రక్తదానం
- February 27, 2016
రెండు దశాబ్దాలకు పైగా రక్తదాన కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది చిరు మెగా యూత్ పోర్స్ (సిఎంవైఎఫ్). రామదాస్ చందిక తొలిసారిగా 15 మందితో స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఒమన్‌లో 2001లో ప్రారంభమైన ఈ సంస్థ, రక్తదాన కార్యక్రమాలు చేపడుతూ, తన సభ్యుల సంఖ్యను 200 మందికి పైగా విస్తరించుకోగలిగింది. బాషర్‌లోని సెంట్రల్ బ్యాంక్ వద్ద ప్రతి యేడాదీ రక్తదానం చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, బెస్ట్ బ్లడ్ డోనర్ టీమ్‌గా సీఎంవైఎఫ్‌ని ప్రకటించింది. ఎవరికి ఎలాంటి పరిస్థితుల్లో ఏ గ్రూపు రక్తం అవసరమైనా వెంటనే సిఎంవైఎఫ్‌ని సంప్రదించడం పరిపాటిగా మారింది. రక్తదానం మాత్రమే కాకుండా, పలు సేవా కార్యక్రమాల్లోనూ తమ సంస్థ ముందుంటుందని చందిక చెప్పారు. స్వదేశానికి వెళ్ళేందుకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నవారికి విమాన టిక్కెట్లను కూడా ఈ సంస్థ సమకూర్చింది. చందిక ఒమన్‌లో చిన్న వ్యాపారం నిర్వహిస్తూ వస్తున్నారు. రక్తదానం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని ఆదుకుంటుందనీ, దాని ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావని చందిక చెబుతున్నారు. రక్తదానం సామాజిక బాధ్యత అనీ, రక్తదానం దైవకార్యంతో సమానమని ఆయన అంటారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







