వీడియో లింక్ ద్వారా కోర్టుకు హాజరైన ఆంగ్ సాన్ సూకీ
- March 01, 2021
నైపితా: ఆర్మీ నిర్బంధంలో ఉన్న మయన్మార్ ఉద్యమనేత ఆంగ్ సాన్ సూకీ ఇవాళ కోర్టు విచారణకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అయితే ఆమె ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మయన్మార్‌లోని ఆర్మీ.. సైనిక తిరుగుబాటుకు పాల్పడింది. ఆ దేశ అగ్రనేతలను సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సూకీ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. గుర్తు తెలియని లొకేషన్ నుంచే ఆమె కోర్టుకు వీడియో లింకు ద్వారా హాజరయ్యారు. సైనిక తిరుగుబాటు జరిగిన నాటి నుంచి ఆ దేశంలో అల్లర్లు హెచ్చుమీరాయి. ఇప్పటి వరకు ఆ నిరసనల్లో 18 మంది మృతిచెందారు. సూకీతో పాటు నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీకి చెందిన ఇతర నేతలను తక్షణమే రిలీజ్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మోసం జరిగిందని, దాని వల్లే ఎన్ఎల్‌డీ విజయం సాధించినట్లు ఆర్మీ ఆరోపిస్తున్నది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







