‘డి-కంపెనీ’ ట్రైలర్ విడుదల అప్డేట్
- March 02, 2021సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అండర్ వరల్డ్ సినిమాలకు పెట్టింది పేరు.‘సత్య’, ‘కంపెనీ’ వంటి సినిమాలలో అండర్ వరల్డ్ మాఫియా గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు వర్మ.ఇప్పుడు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ‘డి-కంపెనీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వర్మ. ‘డి-కంపెనీ’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతోన్న వర్మ.. దీనికి హైప్ తీసుకురావడానికి బాగానే ప్రచారం చేస్తున్నారు. కాగా ఆమధ్య వచ్చిన టీజర్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. తాజాగా వర్మ ‘డి-కంపెనీ’ ట్రైలర్ ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు వర్మ ప్రకటించారు.మార్చి 26న సినిమా విడుదల కానుంది. స్పార్క్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై స్పార్క్ సాగర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ మూవీ ఐదు భాషల్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్‌ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!