మాదకద్రవ్యాల స్మగ్లింగ్..గుట్టురట్టు చేసిన కస్టమ్స్ ఆఫీసర్లు
- March 04, 2021
దోహా:సినిమా రేంజ్ లో స్మగ్లింగ్ కు ప్లాన్ చేసి అడ్డంగా బుక్కైపోయారు స్మగ్లర్లు.గంజాయి, ట్రామాడోల్ పిల్స్ ను కడుపులో దాచుకొని ఖతార్లోకి ఎంటరయ్యేందుకు ప్లాన్ చేశారు. కానీ, హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో దొరికిపోయారు. అనుమానస్పదంగా కనిపించటంతో ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను క్షణ్ణంగా తనిఖీ చేశారు. బాడీ మొత్తం స్కాన్ చేసి చెక్ చేశారు. దీంతో కడుపులో పోట్లాలుగా కట్టిన పిల్స్ ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 48.3 గ్రాములు గంజాయి పిల్స్, 9 ట్రామాడోల్ నార్కోటిక్ పిల్స్ ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మాదకద్రవ్యాలు, నిషేధిత ఉత్ప్రేరకాలను దేశంలోకి స్మగ్లింగ్ చేయాలని చూస్తే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!