ఇండియన్ ఏవియేషన్ - 2016 సదస్సు మార్చి 16 నుంచి
- February 27, 2016
జాతీయ స్థాయి వైమానిక ప్రదర్శనకు హైదరాబాద్ వేదిక కానున్నది. ఇండియన్ ఏవియేషన్ - 2016 సదస్సును మార్చి 16 నుంచి హైదరాబాద్‌లోని బేగంపేట అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఈ ప్రదర్శనకు అవసరమైన ఏర్పాట్ల పర్యవేక్షణకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ శ్రీవాత్సవ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఐదు రోజుల పాటు సాగే వైమానిక ప్రదర్శన ఏర్పాట్లపై ఆయన రాష్ట్ర అధికారులతో సమీక్షిస్తారు. మార్చి 16, 17, 18లలో వైమానిక ప్రదర్శనలతోపాటు సదస్సులు, చర్చాగోష్ఠులు నిర్వహిస్తారు. చివరి రెండు రోజులు 19, 20లలో పూర్తిస్థాయి ప్రదర్శనలు జరుగుతాయని పౌర విమానయానశాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









