పర్యటన ఫలప్రదమైందని : కేపీ ఓలి
- February 27, 2016
భారత్‌లో తన పర్యటన ఫలప్రదమైందని నేపాల్ ప్రధాని కేపీ ఓలి తెలిపారు. మాదేషీల ఆందోళనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు నా పర్యటన దోహదపడింది అని భైరాఘవలో జరిగిన సభలో చెప్పారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మాదేషీ పార్టీల ఐక్య ప్రజాతంత్ర ఫ్రంట్ మాత్రం భారత్‌లో ప్రధాని ఓలి పర్యటన పూర్తిగా విఫలమైందని, ఎటువంటి ఎజెండాలేకుండా ఆయన భారత్‌లో పర్యటించడం పొరపాటని పేర్కొంది. తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే మరోదఫా ఆందోళన చేస్తామని శనివారం సమావేశం తర్వాత తెలిపింది. తమ డిమాండ్ల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించకపోతే ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని పేర్కొంది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







