రీమేక్ సినిమాలో బన్నీ..
- February 27, 2016మెగా హీరోలందరూ రీమేక్ సినిమాల మీదే దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్ రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకువచ్చాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా రీమేక్ సినిమాతోనే రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. విజయ్ హీరోగా ఘనవిజయం సాధించిన కత్తి సినిమాను వినాయక్ దర్శతక్వంలో తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు చిరు.ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా చేరనున్నాడట. ఇటీవల తమిళ్ లో ఘనవిజయం సాధించిన కనిథన్ రీమేక్ లో నటించడానికి బన్నీ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. అధర్వ, కేథరిన్ థెరిస్సాలు జంటగా తెరకెక్కిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను బాలీవుడ్ లోనూ రీమేక్ చేస్తున్నారు.యంగ్ హీరో అర్జున్ కపూర్ ఈ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు.ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిస్సాలు లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 22న రిలీజ్ కు రెడీ అవుతోంది. సరైనోడు సినిమా రిలీజ్ తరువాత కనీథన్ రీమేక్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం