ఉచిత మెడికల్ క్యాంప్ ను ప్రారంభించిన ఎపి డిజిపి
- March 05, 2021
అమరావతి:మార్చి నెల 8 వ తేదీన, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, డిజిపి కార్యాలయంలో ఎపిక్ ఫ్యూజన్ హెల్త్ కేర్ సొల్యుషన్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ డిజిపి గౌతం సవాంగ్ ప్రారంభించారు.పోలీస్ ప్రధాన కార్యాలయం లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినిలకు, మహిళా సిబ్బంది కొరకు క్యాంప్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రప్రదమంగా మహిళల రక్షణ మరియు భద్రత కు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా దిశ ప్లాట్ఫాం ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళ తప్పనిసరిగా దిశ యాప్ ను తమ మొబైల్ ఫోన్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.అదే విధంగా ప్రజలు ఉత్తమైన సేవలను అందించేందుకు ప్రవేశపెట్టిన అదునాతన సాంకేతిక టెక్నాలజీ వినియోగంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ దేశానికే తలమానికంగా నిలిచిందని పేర్కొన్నారు. మహిళా సమాజంలో తల్లిగా, చెల్లిగా, అక్కగా,మహిళల అద్వితీయమైన పాత్రను పోషిస్తున్నారని డిజిపి కొనియాడారు.అటువంటి మహిళలకు సేవ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు.మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని, వారి ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ రోజు ఉచిత మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎపిక్ ఫ్యూజన్ హెల్త్ కేర్ సొల్యుషన్స్ సిఈఓ శ్రీధర్ రెడ్డి,అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ L&O రవిశంకర్ అయ్యన్నార్ ,IG P&L నాగేంద్ర కుమార్, ఓఎస్డి భద్రత రామకృష్ణ ( రిటైర్డ్) మరియు మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







