ఇద్దరు ప్రయాణీకులకు మాత్రమే ట్యాక్సీలో అనుమతి
- March 05, 2021
కువైట్ సిటీ:నెల రోజులపాటు కర్‌ఫ్యూని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కువైట్, వలసదారులపైన కూడా తాత్కాలిక బ్యాన్ విధించింది. కాగా, ట్యాక్సీల్లో ప్రయాణించే ప్రయాణీకుల విషయంలోనూ సరికొత్త నిబంధనలను అథారిటీస్ విధించడం జరిగింది. కేవలం ఇద్దరు ప్రయాణీకుల్ని మాత్రమే ట్యాక్సీలో అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు. కాగా, కరోనా నేపథ్యంలో అమలు చేసిన ఈ నిబంధన పట్ల ట్యాక్సీ ఓనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణీకులు సైతం, కుటుంబ సమేతంగా వెళ్ళాల్సి వస్తే ఈ నిబంధన తమకు ఇబ్బందికరంగా మారుతున్నట్లు అభిప్రాయపడ్డారు. క్యాబ్ ఓనర్లు తమ అభ్యంతరాల్ని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు కూడా. అయితే, కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి నిబంధనల్ని కఠినతరం చేయక తప్పడంలేదు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!