‘కర్ఫ్యూ కారణంగా రెస్టారెంట్ అమ్మకం’ బ్యానర్ల తొలగింపు

‘కర్ఫ్యూ కారణంగా రెస్టారెంట్ అమ్మకం’ బ్యానర్ల తొలగింపు

కువైట్:ఓ రెస్టారెంట్ ముందు ‘కర్ఫ్యూ కారణంగా రెస్టారెంట్ అమ్మకం’ అంటూ ఏర్పాటు చేయబడ్డ ప్రకటనని తొలగించాయి అథారిటీస్.కర్ఫ్యూలపై ప్రభుత్వ తీరు కారణంగా వచ్చిన నష్టాల వల్ల రెస్టారెంట్ అమ్మకానికి..అనేది ఆ బ్యానర్ సారాంశం.ఖైతాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో రెస్టారెంట్ తీవ్ర నష్టాల్లోకి వెళ్ళిపోయిందనీ,అప్పులు తీర్చడానికి రెస్టారెంట్ అమ్మకం తప్ప తనకు వేరే దారి కనిపించలేదని రెస్టారెంట్ నిర్వాహకుడు పేర్కొన్నాడు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Back to Top