ట్రాఫిక్ వీక్ 2021కి సిద్ధమవుతున్న బహ్రెయిన్
- March 07, 2021
బహ్రెయిన్:ప్రతి యేటా నిర్వహించే ట్రాఫిక్ వీక్ ను ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు బహ్రెయిన్ సిద్ధమవుతోంది. ట్రాఫిక్ రూల్స్ పై వాహనదారుల్లో అవగాహన కల్పించటం..రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పాటించాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ బహ్రెయిన్ ప్రతి యేటా వారం రోజుల పాటు ట్రాఫిక్ వీక్ నిర్వహిస్తూ ఉంటుంది. సాధారణంగా మార్చి నెలలో ఎక్కువగా ఈవెంట్ ఉంటుంది. ఈ ఏడాది కూడా ట్రాఫిక్ వీక్ 2021 నిర్వహించేందుకు తాము సన్నద్ధమైనట్లు ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ అబ్దుల్ వాహబ్ అల్ ఖలీఫా తెలిపారు.అయితే..ప్రపంచం ఆరోగ్య సంక్షోభ సవాళ్లను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నిర్వహించాల్సి వస్తోందని అన్నారు. అయితే..ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పిస్తూ..ఎప్పటికప్పుడు చేపడుతున్న సంస్కరణ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు ఆయన వివరించారు.ఈ-సర్వీస్ సేవలను వినియోగించుకుంటున్న వారి సంఖ్య 43 శాతం పెరిగిందన్నారు. ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







