కోవిడ్ రూల్ బ్రేక్ చేస్తే దేశ బహిష్కరణ
- March 07, 2021
కువైట్: కోవిడ్ నిబంధనలు ప్రవాసీయులు, పౌరులు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని కువైట్ అధికారులు మరోసారి స్పష్టం చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. వైరస్ తీవ్రత అదుపులోకి రాకపోగా..సెకండ్ ప్రమాదం కూడా వెంటాడుతుండటంతో కువైట్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం ఇవాళ్టి నుంచే అమలులోకి రానుంది. సాయంత్రం 5 నుంచి 12 గంటల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కీలక ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ప్రవాసీయులు అయితే దేశం నుంచి బహిష్కరిస్తామని, పౌరులు నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







