కోవిడ్ రూల్స్ బ్రేక్..షాపింగ్ సెంటర్ క్లోజ్

- March 07, 2021 , by Maagulf
కోవిడ్ రూల్స్ బ్రేక్..షాపింగ్ సెంటర్ క్లోజ్

యూఏఈ:వైరస్ తీవ్రతను అరికట్టేందుకు ప్రభుత్వం ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా..హెచ్చరికలు జారీ చేస్తున్నా కొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. అజ్మన్లోని ఓ షాపింగ్ సెంటర్ నిర్వహాకులు తమ సేల్స్ పెంచుకునేందుకు ఫ్లాష్ సేల్ ఆఫర్ ప్రకటించి చేతులు కాల్చుకుంది. ఫ్లాష్ సేల్ కి వినియోగదారుల నుంచి విశేష స్పందన రావటంతో జనం ఎగబడిపోయారు. కోవిడ్ రూల్స్ ను పాటించకుండా పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో వినియోగదారులకు అనుమతి ఇవ్వటమే కాకుండా..ఎక్కడా భౌతిక దూరం ఆనవాళ్లు కనిపించలేదు. సేల్స్ పెంచుకునేందుకు ప్రజల ఆరోగ్య భద్రత, కోవిడ్ రూల్స్ ను బ్రేక్ చేసిన షాపింగ్ సెంటర్ నిర్వాహకుల తీరును అజ్మన్ పోలీసులు తప్పుబట్టారు. షాపింగ్ సెంటర్ ను మూసివేయటంతో పాటు నిర్వాహకులకు 5000 దిర్హామ్ ల జరిమానా విధించారు. షాపింగ్ సెంటర్లో జనం కిక్కిరిసిన వీడియోని రిలీజ్ చేస్తూ..సమాజ ఆరోగ్య భద్రత కోసం అందరూ బాధ్యతగా వ్యవహరించాలని, కోవిడ్ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com