సింగరేణి బొగ్గు గనుల్లో షూటింగ్ జరుపుకుంటున్న ‘ఆచార్య’
- March 07, 2021
తెలంగాణ:మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.రాంచరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.రాంచరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.రీసెంట్గా తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పూజా హెగ్డేతో షూటింగ్ పూర్తి చేసుకున్న రాంచరణ్.. తాజాగా తండ్రి చిరంజీవితో కలిసి ఖమ్మం జిల్లా ఇల్లందు సింగరేణి బొగ్గు గనుల్లో కనిపించారు.ఈ తాజా షెడ్యూల్ మార్చి 7 మార్చి 15 వరకు షూటింగ్ జరగనుంది. ఇల్లెందులోని జేకే మైన్స్ లో ఓపెన్ కాస్ట్, భూగర్భ గనుల్లో చిరంజీవి, రామ్ చరణ్ లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఈమేరకు బొగ్గు గనుల వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు.షూటింగ్ కు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటికి విచ్చేసిన ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి,తనయుడు రామ్ చరణ్ లకి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వాగతం పలికారు.ఈమేరకు మంత్రి పువ్వాడ తన ఇంట్లో బస ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష