శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- March 08, 2021
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది.ఇవాళ ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో 2.3 కిలోల బంగారం లభించింది.ముందస్తు సమాచారంతో కస్టమ్స్ అధికారులు విమానాన్ని తనిఖీ చేశారు.ఈ క్రమంలో సీటు కింద ఉన్న లైఫ్ జాకెట్‌లో బంగారు బిస్కెట్లను గుర్తించారు.దీంతో అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరో ఘటనలో కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్నషేక్ మస్తాన్ అనే ప్రయాణికుడి వద్ద బంగారం లభ్యమైంది. పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో తనిఖీలు చేశారు. తనిఖీల్లో అక్రమంగా బంగారాన్ని లోదుస్తుల్లో తరలిస్తున్న నిందితుడి మస్తాన్ని కస్టమ్ అధికారులు గుర్తించారు.నిందితుడి వద్ద ఉన్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష