మహిళలకు ప్రముఖుల 'ఉమెన్స్ డే' శుభాకాంక్షలు

- March 08, 2021 , by Maagulf
మహిళలకు ప్రముఖుల \'ఉమెన్స్ డే\' శుభాకాంక్షలు

న్యూ ఢిల్లీ:నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. దేశ మహిళలందరికీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్,ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,ప్రధాని మోదీ‌ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ' దేశంలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనదేశంలో మహిళలు విభిన్న రంగాల్లో విజయ పరంపర కొనసాగిస్తూ.. రికార్డులు సఅష్టిస్తున్నారు. స్త్రీ, పురుష అసమానతల్ని నివారించడానికి మనందరం సమిష్టిగా కృషి చేయాలి' అని సోమవారం రాష్ట్రపతి ట్విటర్‌లో పోస్టు చేశారు.

మహిళలందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీమణులకు వందనం.మహిళలు సాధిస్తున్న విజయాల పట్ల దేశం గర్విస్తోంది. అనేక రంగాల్లో మహిళా సాధికారత దిశగా పనిచేసే అవకాశం లభించడం మా ప్రభుత్వానికి ఎంతో గౌరవం' అని మోడి ట్వీట్‌ చేశారు.మహిళలకు ఎపి సిఎం జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని జగన్‌ కొనియాడారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.

మహిళలకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు మహిళా సాధికారత చాలా కీలకమన్నారు. మహిళ అభివృద్ధే కుటుంబ అభివృద్ధి అని తెలిపారు. కోవిడ్‌ సమయంలో వివిధ రంగాల్లో మహిళలు చేసిన సేవలను కొనియాడారు.

మహిళా లోకానికి సిఎం కెసిఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పాలనలో, అభివృద్ధిలోనూ అతివలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సమస్యలు ఎన్ని ఎదురైనా వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని GHMC మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అన్నారు. హైదరాబాద్‌ నగర మహిళలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com