వలస కార్మికుల వర్క్ పర్మిట్ ఫీజుల తగ్గించిన ఒమన్

- March 10, 2021 , by Maagulf
వలస కార్మికుల వర్క్ పర్మిట్ ఫీజుల తగ్గించిన ఒమన్

ఒమన్:కోవిడ్ సంక్షోభాన్ని తట్టుకొని శ్రామిక రంగం నిలదొక్కుకునేలా ఒమన్ ప్రభుత్వం పలు రాయితీలు, ప్రొత్సాహకాలు ప్రకటించింది. వలస కార్మికులకు కూడా లబ్ధి చేకూరేలా నిర్ణయాలు వెల్లడించింది. వలస కార్మికుల నియామక లైసెన్స్ ఫీజులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఒమన్ శ్రామిక రంగానికి ఉద్దీపన ప్యాకేజీ కింద 20 మిలియన్ల రియాల్స్ ను 2021 బడ్జెట్లో కేటాయించింది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఒమనీ పౌరులకు సరైన శిక్షణ ఇచ్చి లేబర్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం పెంచేందుకు నిధులను వినియోగించనున్నట్లు తెలిపింది. వలస కార్మికుల నియామక లైసెన్స్ ఫీజు, వర్క్ ప్రాక్టీస్ లైసెన్స్ రెన్యూవల్ ఫీజులను తగ్గించామని వివరించింది. ఒమనైజేషన్ లక్ష్యాలకు చేరుకున్న సంస్థలకు లైసెన్స్ ఫీజులో 50 శాతం..ఒమనీ శ్రామిక శక్తిని ప్రొత్సహిస్తున్న కంపెనీలు, సంస్థలకు 25శాతం మేర రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com