వ్యాక్సినేషన్ పొందిన వినియోగదారులకు డిస్కౌంట్లు

- March 10, 2021 , by Maagulf
వ్యాక్సినేషన్ పొందిన వినియోగదారులకు డిస్కౌంట్లు

రియాద్:కరోనా వ్యాక్సినేషన్ పొందిన వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్లు ఇచ్చేందుకు వీలుగా మాల్స్, స్టోర్స్, మార్కెట్స్ అలాగే షాప్స్‌కి అనుమతిచ్చింది సౌదీ అరేబియా ప్రభుత్వం.తద్వారా వ్యాక్సినేషన్ పట్ల ప్రజలు మరింత ఆసక్తి చూపుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం స్టోర్స్ లేదా మార్కెట్లు ప్రత్యేకంగా లైసెన్సులు పొందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదనపు డిస్కౌంట్లకు సంబంధించి ఎలాంటి అదనపు ఛార్జీలూ వసూలు చేయబోవడంలేదని కూడా ప్రభుత్వం తేల్చి చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com