ప్రభుత్వ రుసుముపై ‘ఫ్రీజ్’ 2023 వరకు పొడిగింపు

- March 10, 2021 , by Maagulf
ప్రభుత్వ రుసుముపై ‘ఫ్రీజ్’ 2023 వరకు పొడిగింపు

దుబాయ్:ప్రభుత్వ సర్వీసు రుసుముపై ‘ఫ్రీజ్’ 2023 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కరోనా పాండమిక్ నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఆయా రంగాలకు ఈ ‘ఫ్రీజ్’ అనేది ఎంతో ఉపకరిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2018 మార్చిలో తొలిసారిగా ఈ ‘ఫ్రీజ్’ని అమల్లోకి తెచ్చారు. సామాజిక స్థిరత్వానికి ఈ ‘ఫ్రీజ్’ ఉపకరిస్తుంది. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల నడుమ స్థిరమైన అభివృద్ధి కోసం ఈ ‘ఫ్రీజ్’ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు క్రౌన్ ప్రిన్స్ వెల్లడించారు. 2020 మార్చిలో దుబాయ్ ప్రభుత్వం ప్రకటించిన ఐదు ఆర్థిక ప్యాకేజీలకు ఈ సర్వీసు రుసుము ‘ఫ్రీజ్’ ఊతమిస్తుందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com