'శశి' ట్రైలర్ విడుదల...

- March 10, 2021 , by Maagulf
\'శశి\' ట్రైలర్ విడుదల...

హైదరాబాద్:ఆది సాయికుమార్ హీరోగా నటించిన చిత్రం 'శశి'. సుర‌భి నాయికగా నటించిన ఈ లవ్ అండ్  యాక్షన్ ఎంటర్టైనర్ కి శ్రీ‌నివాస్ నాయుడు దర్శకుడు. పవన్ కళ్యాన్ చేతుల మీదుగా ఈ సినిమా  ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన టీజర్ తో పాటు 'ఒకే ఒక లోకం నువ్వే' పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోందని, ట్రైలర్ కూడా అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని నిర్మాతలు ఆర్‌.పి.వ‌ర్మ, సి.రామాంజ‌నేయులు,చింత‌ల‌పూడి శ్రీ‌నివాస్ చెబుతున్నారు. 'మనం ప్రేమించే వాళ్ళు పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది' అనే ఆది డైలాగ్ తో ట్రైలర్ ఆరంభం అవుతుంది. ఇక 'మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, ముందు మన బలహీనతలను గెలవాలి'... 'ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్న చోట నిలబెట్టుకోవడం'... 'ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా.. పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ మూర్ఖత్వం' వంటి డైలాగ్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.ఈ పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కి కూడా ఇందులో చోటు కల్పించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com