ప్రతిరోజూ జాతీయ పతాకావిష్కరణ జరపాలని కెవిఎస్ ఆదేశాలు
- February 28, 2016
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రతిరోజూ జాతీయ పతాకావిష్కరణ జరపాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) ఆదేశాలు జారీ చేసింది. సెంట్రల్ యూనివర్శిటీలు తమ ప్రాంగణాల్లో రోజూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని నిర్ణయించిన కొద్ది రోజులకే కెవిఎస్ ఈ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు త్రివర్ణ పతాకానికి వందనం చేయడానికి వీలుగా ఉండేలా విద్యార్థులు రోజూ ప్రార్థన చేసే ప్రదేశంలో ప్రముఖంగా కనిపించేలా పతాకాన్ని ఎగురవేయాలని కెవిఎస్ అడిషనల్ కమిషనర్ యుఎన్ ఖవారే పేర్కొన్నారు.
ఉదయం పతాకావిష్కరణ చేసి, సాయంత్రం సూర్యాస్తమయంలోగా అవనతం చేయాలని కేంద్రీయ విద్యాలయాల ప్రిన్సిపాల్స్‌కు ఖవారే ఒక లేఖ రాశారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ కెవిఎస్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







