IPL2022 కొత్త జట్ల వేలానికి తేదీ ఖరారు

- March 14, 2021 , by Maagulf
IPL2022 కొత్త జట్ల వేలానికి తేదీ ఖరారు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)2022లో మరో రెండు జట్లు అదనంగా చేరనున్నాయి.దాంతో క్యాష్ రిచ్ లీగ్ IPL‌లో జట్ల సంఖ్య మొత్తం పదికి చేరనుంది.కొత్త జట్లకు సంబంధించిన వేల ఈ ఏడాది మే నెలలో నిర్వహించాలని యాజమాన్యం భావించింది.ఈ మేరకు శనివారం జరిగిన IPL‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.పాలక వర్గం నిర్ణయంతో ఐపీఎల్‌లో పది జట్లు బరిలోకి దిగడం ఖరారైంది.బిడ్డింగ్‌ ప్రక్రియ తర్వాత కొత్త ఫ్రాంచైజీలు మే చివరి వరకు ఖరారైతే... ఆయా జట్లు తమ సన్నాహాలు చేసుకునేందుకు ఏడాది పాటు సమయం ఉంటుందని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు.

అయితే BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా, మరికొందరు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించి శనివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలుత ఈ ఏడాదే మరో రెండు ఫ్రాంఛైజీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే మెగా IPL వేలం నిర్వహించడానికి సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో 8 జట్లతోనే IPL‌ కొనసాగించాలని పాలక వర్గం నిర్ణయింది.10 జట్ల నిర్ణయాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.ఈ క్రమంలోనే మే నెలలో కొత్త జట్ల వేలానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

ఐపీఎల్ 2021 సీజన్‌ ఏప్రిల్ 9న ఆరంభం కానుంది.ఏప్రిల్ 9న డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లు జరగనున్నాయి.భారత కాలమాన ప్రకారం.. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3.30 గంటలకి ప్రారంభంకానుండగా..రాత్రి మ్యాచ్‌లు 7.30గంటలకి స్టార్ట్ అవుతాయి.చెన్నై, బెంగళూరు, ముంబయి,ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్ రూపంలో మొత్తం ఆరు సిటీలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్ వేదికగా జరగనుండగా.. మొత్తం 11 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com