రేపు ‘మేజర్’ అనౌన్స్ మెంట్
- March 14, 2021
హైదరాబాద్:‘ఎవరు’,‘క్షణం’, ‘గూఢచారి’ వంటి చిత్రాల ద్వారా తానేంటో నిరూపించుకున్నాడు హీరో అడవి శేషు.ఈ సినిమాల తర్వాత ‘మేజర్’ సినిమా వస్తుండడంతో అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సూపర్ మహేష్ కు చెందిన బీఎంజీ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు సోనీ పిక్చర్స్ శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.శశికిరణ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.శోభిత ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.2006లో ముంబైలో పాకిస్తాన్ టెర్రరిస్టులు సాగించిన ఉగ్రదాడిలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణించాడు. ఆయన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాను వచ్చే జూలై 2న రిలీజ్ చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు.రేపు ఉన్నికృష్ణన్ జయంతి సందర్భంగా సాయంత్రం 4 గంటలకు మేజర్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







