దోహా ఖతార్ లో జనసేన పార్టీ 7వ ఆవిర్భావ దినోత్సవం..
- March 15, 2021
దోహా:ఖతార్ దేశంలో గల్ఫ్ సేన జనసేన ఆధ్వర్యంలో ఘనంగా 7వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.ఖతార్-జనసేన కోర్ కమిటీ నాయకులు శ్రీకాంత్ కొమ్ముల,వీర బాబు,దొర,సత్యం మేడిది మరియు కమిటీ సభ్యులు గౌతమ్ కొమ్మిశెట్టి, వెంకట సురేష్, అప్పలనాయుడు ,జానకి రామ్,వంశీ కృష్ణ, రాజు, కోటి, లక్ష్మణ ప్రసాద్, సుధాకర్, ఇంకా మహిళలు -హరి ప్రియ,నీలిమ,మణి, సాహిత్య,వాణి, శేషవేణి, శిరీష రామ్ ,అనిల్ ఓరుగంటి,రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సంధర్భంగా సత్యం మేడిది మాట్లాడుతూ పంచాయతీ,మున్సిపల్ ఎన్నికల్లోవిజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ విజయం ఎంతో సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందన్నారు.
మార్పు ప్రారంభం అయిందని,ఆంధ్రప్రదేశ్ ప్రజలు జన సేనాని పవన్ కళ్యాణ్ వెంట నడువడానికి సిధ్ధంగా ఉన్నారనడానికి ఈ ఎన్నికల ద్వారా రుజువు అయిందన్నారు.గత తెలుగు దేశం ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి ని గాలికి వదిలేసి కేవలం తమ రాజకీయ లబ్ది కోసం,కేసులో మాఫీ కై కేంద్ర ప్రభుత్వం తో కుమ్మక్కై విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తున్నారని,జనసేన దీనికి వ్యతిరేకంగా పోరాడుతుందని.ఎన్నారై విభాగాల ఆధ్వర్యంలో ఈ విషయం పై ఉద్యమిస్తామని హెచ్చరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష