శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దృశ్యం 2 చిత్రం

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దృశ్యం 2 చిత్రం

విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న సీక్వెల్ చిత్రం దృశ్యం 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇటీవలే ఓటిటి విడుదలైన మలయాళ సస్పెన్స్ డ్రామా చిత్రం దృశ్యం 2 మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఇప్పుడు వెంకటేష్ తెలుగులో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటి పూర్ణ ఓ ప్రముఖ పాత్రలో నటిస్తున్న విషయం పోషిస్తున్నారు. ఆమె షూటింగ్ స్పాట్ లో దిగిన ఫోటో వైరల్ అయింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నటి మీనా నిన్నటి నుంచి సినిమా సెట్స్‌లోకి చేరారు. ఈ చిత్రాన్ని దర్శకుడు జీతు జోసెఫ్ తెలుగు రీమేక్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు, ఇందులో మరి కొందరు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు.

Back to Top