సూపర్ హీరోగా కెటి రామారావు తనయుడు హిమాన్షు
- February 28, 2016
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మనువడు, మంత్రి కెటి రామారావు తనయుడు హిమాన్షు సూపర్ హీరోగా దర్శనమివ్వబోతున్నాడు. యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో నిర్మించనున్న 'సూపర్ హార్ట్' షార్ట్ ఫిల్మ్‌లో హిమాన్షు లిటిల్ హీరో పాత్ర పోషిస్తున్నాడు.సాంఘిక దురాచారాలను రూపుమాపడం, సామాజిక బాధ్యతలను తెలియజెప్పడం ఇతివృత్తంగా ఆరు నుంచి పది నిమిషాల నిడివితో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కనుంది. ఏసియన్ స్ట్రాంగ్ మ్యాన్‌గా పేరున్న మనోజ్ చోప్రా ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండగా సూపర్ హీరో పాత్రల్లో ఒకరిగా హిమాన్షుకు అవకాశం లభించింది.వివిధ దేశాలకు చెందిన మరో ఆరుగురు సూపర్ హీరోలు ఇందులో నటించనున్నారు. బాలకార్మికులు, పిల్లల అక్రమ రవాణా, అవినీతి, లంచగొండితనం, మద్యపానం తదితర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఫైట్లు చేసే అద్భుతమైన సూపర్ హీరో స్టంట్లు ఇందులో ఉంటాయి.యున్డబ్ల్యూటీవో షార్ట్ ఫిల్మ్ ఉత్సవంలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆదివారం ఈ చిత్ర నిర్మాణాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారితోపాటు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్, మనోజ్ చోప్రా పాల్గొన్నారు.స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో ప్రారంభోత్సవానికి హిమాన్షు హాజరు కాలేకపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. మార్చి 22 నుంచి జరిగే చిత్ర నిర్మాణంలో హిమాన్షు పాల్గొననున్నాడు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









