ఉమ్రా: 70 ఏళ్ళ వయసు వరకు స్వదేశీ యాత్రీకులకు అనుమతి
- March 18, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా వెల్లడించిన వివరాల ప్రకారం 18 నుంచి 70 ఏళ్ళ వయసుగల డొమెస్టిక్ యాత్రీకులకు ఉమ్రా ప్రార్థనల కోసం అనుమతించనున్నట్లు తెలుస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ జారీ చేసిన సూచనల మేరకు తగు మార్గదర్శకాల్ని యాత్రీకులు పాటించాల్సి వుంటుంది. ఈతమర్నా అప్లికేషన్ వున్నవారు, ప్రస్తుత పరిమితి గడువు తీరాక తిరిగి ఉమ్రా ప్రార్థనల్లో పాల్గొనవచ్చు. ఇందుకోసం వారికి ప్రత్యేక పర్మిట్ జారీ చేయబడుతుంది. ప్రస్తుత విధానం ప్రకారం ప్రతి 15 రోజులకు ఓ సారి ఉమ్రా అనుమతి జారీ చేయబడుతుంది. కాగా, రవాణా సదుపాయి అనేది ఆప్షనల్. 2020 నవంబర్ 1 నుంచి ఉమా ప్రార్థనల కోసం డొమెస్టిక్ అలాగే అంతర్జాతీయ యాత్రీకులకు అనుమతినిస్తున్నారు. 20,000 మంది ఉమ్రా యాత్రీకులకు ఉమ్రా కోసం అనుమతినివ్వడం జరిగిందనీ, 60,000 మంది గ్రాండ్ మసీదులో ప్రార్థనలు పూర్తి చేసుకున్నారనీ నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







