పుదీనా చికెన్ బజ్జీలు

- March 19, 2021 , by Maagulf
పుదీనా చికెన్ బజ్జీలు

కావాల్సిన పదార్థాలు..

  • చికెన్- అరకిలో
  • పుదీనా- 2 కప్పులు
  • కొత్తిమీర- కప్పు
  • అల్లం ముక్క- కొద్దిగా
  • వెల్లుల్లి- రెబ్బలు
  • పచ్చిమిర్చి- 5
  • పెరుగు – అరకప్పు
  • గరం మసాలా- టీ స్పూను
  • పసుపు- అర స్పూను
  • ఉప్పు – రుచికి తగినంత
  • నూనె – అర కప్పు
  • నిమ్మకాయలు 1
  • జీడిపప్పు అవసరమైనన్నీ.

తయారీ విధానం..
ముందుగా కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి మిక్సి పట్టి పేస్టులా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనికి చికెన్ కలిపి దాంతోపాటు తగినంత ఉప్పు, పసుపు, పెరుగు, గరంమాసాల కలిపి గంటసేపు ఫ్రీజ్ లో పెట్టుకోవాలి. అనంతరం ఒక బాణాలి తీసుకోని అందులో కాస్తా నూనే వేసి వేడి చేసుకోవాలి. అందులో జీడిపప్పులు వేయించాలి. అందులోనే చికేన్ ముక్కులు కూడా వేయాలి. చికెన్ అన్ని వైపులా చక్కగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అందులోనే నిమ్మరసం, కొత్తిమీర వేసి మరికాసేపు వేయించాలి. అంతే ఎంతో రుచికరంగా కరకరలాడే పుదీనా చికెన్ రెడి అయిపోతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com