ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు భారత్‌ జట్టును ప్రకటించిన BCCI

- March 19, 2021 , by Maagulf
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు భారత్‌ జట్టును ప్రకటించిన BCCI

ముంబై:టీం ఇండియా జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌తో ఫుల్‌ బిజీగా ఉంది. ఇప్పటికే టెస్ట్‌, టీ-20 సిరీస్‌లు పూర్తి కాగా.. వన్డే సిరీస్‌ మిగిలిపోయింది.ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు టీం ఇండియా జట్టును ప్రకటించింది BCCI. 18 మందితో కూడిన ఈ జట్టులో గత ఆసీస్‌ పర్యటనలో పాల్గొన్నవారే ఎక్కువగా ఉండటం గమనార్హం.నటరాజన్, హైదరాబాద్‌ ఆటగాడు సిరాజ్‌, కృనాల్‌ పాండ్యా, కులదీప్‌ యాదవ్‌, ప్రసిద్ కృష్ణ, శుభమన్‌ గిల్‌ లాంటి ఆటగాళ్లు జట్టులో చోటు సంపాదించుకున్నారు. వన్డేల్లో తొలిసారి సూర్యకుమార్‌, కృనాల్‌ పాండ్యా, ప్రసిద్ధ కృష్ణకు చోటు దక్కడం విశేషం. ఇక ఇంగ్లాండ్‌తో ఈ నెల 23 నుంచి వన్డే మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.పూణే వేదికగా ఈ వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి.  మార్చి 23, 26, 28 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. 

జట్టు వివరాలు:

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, శుభ్ మన్‌ గిల్‌,  శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, రిషబ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, సుందర్‌, నటరాజన్‌, భువనేశ్వర్‌, సూర్యకుమార్‌, కృనాల్‌ పాండ్యా, ప్రసిద్ధ కృష్ణ, ఠాకూర్‌,  చాహల్‌, 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com