దంత సమస్యల పై వివరణ ఇచ్చిన దంత వైద్య నిపుణురాలు డా.దీప్తి జాజాల
- March 19, 20211.పంటి సమస్యలు ఎలా గుర్తించాలి అంటే?
- పళ్ళు తోముకున్నతర్వాత మరియు ఫ్లాసింగ్ చేసిన తర్వాత రక్తము కనిపించిన యెడల
- నోటి నుండి చాలా కాలం గా దుర్వాసన వస్తుంటే
- వేడి లేదా చల్లని పదార్థాల వల్ల ఆకస్మికంగా జివ్వు మంటుంది
- వదులుగా ఉన్న పళ్ళు
- చిగుళ్లు జారుట
- తినేటప్పుడు నొప్పి
- వాచిన చెంప
- విరిగిన దంతాలు.
2.పిల్లల్లో వచ్చే దంత సమస్యలకి పరిష్కారాలు:
- పిల్లలు సరిగ్గా దంతాలు తోముకున్నా, తరచూ దీంతో వైద్యున్ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు దంత సమస్యలను దూరం చేసుకోవచ్చు.రోజూ రెండు సార్లు దంతాలు తోముకోవాలి, ఫ్లోరైడ్ పేస్ట్ తో.పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తక్కువగా తీసుకుంటే మంచిది.
3.ఆధునిక దంత సంరక్షణ లో వచ్చిన మార్పులు:
- లేజర్ చికిత్స,(చిగుళ్లు మరియు దంతాలు) *ఇంప్లాంట్స్(పళ్ళు లేని చోట అమర్చుట) *డిజిటల్ ఎక్స్ రే (వైద్యులు మరియు రోగి యొక్క సమయం ఆదా చేసుకోవచ్చు)
- ఇంట్రా ఓరల్ కేమెరా(రోగి నోటి లో కంటి కి కనిపించని దంత క్షయం లాంటి వాటిని వైద్యుడు చూడడానికి మరియు రోగి కి చూపించడానికి)
- ఇన్విసాలిన్(క్లిప్ లతో కాకుండా సున్నితంగా పళ్ళ వరుస సరి చేసుకోవచ్చు).
వెనీర్స్ etc.
4.దంత సమస్యలు రాకుండా ఉండాలంటే:
- ఫ్లోరైడ్ పేస్ట్ తో రోజు ఉదయం రాత్రి మీ దంతాలు తోముకోవాలి.
- రోజు ఒక సారి ఫ్లాసింగ్ చేసుకోవాలి.
- పిండి పదార్థాలు తక్కువగా తీసుకోవాలి.
- తంబాకు మానివేయాలి.
- దంత వైద్యున్ని సంప్రదించాలి ఆరు నెల లకి ఒక సారి.
5.ఏదైనా సమస్య వల్ల దంతాలు తొలగించాల్సి వస్తే అక్కడ మళ్లీ దంతాలు ఈ కింది విధాలుగా అమర్చుకునే వీలు ఉంటుంది?
a- ఇంప్లాంట్స్
b-ఫిక్సడ్ బ్రిడ్జి
c-రిమూవబుల్ డెంచర్.(తీసి పెట్టుకునేవి)
6.రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తరువాత ట్రీట్మెంట్ సరిగా జరగకపోవడం వల్ల వచ్చే సమస్యలు.
a- దంతం విరిగిపోవడం.
b-ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టకపోవడం
సమస్య తలెత్తితే వెంటనే దంత వైద్యున్ని సంప్రదించాలి.
7.చిన్నతనంలో దంతాలు ఊడటం:
- పిల్లలు ఆటలు ఆడటం వల్ల దెబ్బలు తగిలి దంతాలు ఊడిపోవడం జరుగుతుంది.
- అవి పాల పళ్ళు అయితే పర్మినెంట్ దంతాలు మళ్లీ వస్తాయి.
- పర్మినెంట్ దంతాలు ఊడిపోవడం అంటే:
- ఏదైనా దెబ్బ తగిలి లేదా
- చిగుళ్లు ఆరోగ్యంగా లేకపోతే లేదా
- పెద్ద వయసు వారిలో అయితే
- షుగర్ వ్యాది లేదా
- ఆర్థరైటిస్ లేదా
- హైపర్ టెన్షన్
- సిగరెట్ తాగే అలవాటు
- ఏదైనా దెబ్బ తగిలి.
8.జ్ఞాన దంతం వల్ల వచ్చే సమస్యలు
- నోరు పూర్తిగా తెరవడం సాధ్యం కాదు.
- నోటి లో ఒక రకమైన రుచి
- దవడ నొప్పి
- చిగురు నొప్పి, వాపు.
- దవడ వాపు.
జ్ఞాన దంతం సమస్య కు ఓకే ఒక శాశ్వత పరిష్కారం దాన్ని తొలగించడం.దాని వల్ల ఎటువంటి ఇబ్బందీ ఉండదు.మళ్ళీ అక్కడ దంతం అమర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు.
9.నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే పాటించాల్సిన నియమాలు:
- ప్రతి రోజూ ఉదయం రాత్రి దంతాలు తోముకోవాలి . మెత్తగా ఉండే బ్రష్ తో.
- ఫ్లోరైడ్ పేస్ట్ వాడాలి.
- రోజు రాత్రి ఫ్లాసింగ్ చేసుకోవాలి.
- తరచూ దంత వైద్యున్ని సంప్రదించాలి.
- సిగరెట్ తాగే అలవాటు మానాలి.
- పిండి పదార్థాలు తక్కువగా తీసుకోవాలి.
- మౌత్ వాష్ వాడాలి.
- చక్కర ఉన్న పానీయాలు కాకుండా కొబ్బరి నీళ్లు తాగాలి.
10.సాధారణంగా వచ్చే దంత సమస్యలు
- దంత క్షయం.
- చిగుళ్ల వ్యాధి
- దంతాలు అరిగి పోవడం.
- దంతాలు విరిగి పోవడం.
తీవ్రమైన దంత సమస్యలు
- నోటి క్యాన్సర్
- హెర్పిస్
- నోరు పొడి బారి పోవడం
- కాండిడియాసిస్.
- బర్నింగ్ మౌత్ సిండ్రోమ్
- టెంపరో మాండిబులార్ జాయింట్
- సమస్యలు.
--డా.దీప్తి జాజాల(తెలంగాణ) MOH Reference Number: 177227
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!