కరోనా వ్యాక్సిన్ పై క్లారిటీ...
- March 19, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు లోక్ సభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ క్లారిటీ ఇచ్చారు.కరోనా వ్యాక్సిన్ పై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.దేశంలోని రెండు రకాల వ్యాక్సిన్లు సురక్షితమైనవని, అర్హులైన ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని లోక్ సభలో హర్షవర్ధన్ పేర్కొన్నారు.ఈరోజు దేశంలో 39వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.154 మంది కరోనాతో మృతి చెందారు.పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది.రోజుకు 30 లక్షలకు పైగా టీకాలు అందిస్తున్నారు.ఈ సంఖ్యను మరింతగా పెంచాలని ప్రభుత్వం చూస్తున్నది.దేశంలో టీకాకు కొరత లేదని, అదే సమయంలో టీకాలపై వస్తున్న అపోహలను తొలగించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆరోగ్యశాఖ తెలియజేసింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







