సౌదీ పురుషులకు కొత్త నిబంధనలు...
- March 20, 2021
రియాద్:సౌదీ అరేబియా పెళ్లి విషయంలో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.సౌదీ అరేబియాకు పనుల నిమిత్తం వివిధ దేశాల నుంచి ఎక్కువమంది ప్రజలు వస్తుంటారు.అక్కడే పనులు చేసుకుంటూ స్థిరపడుతుంటారు.ఇలా స్థిరపడిన వ్యక్తులు స్థానికులతో పరిచయాలు ఏర్పడతాయి.ఆ పరిచయాలే బంధుత్వంగా మారుతున్నాయి.ఇది సౌదీ అరేబియా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.దీంతో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.పాకిస్తాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్ కు చెందిన మహిళల్ని వివాహం చేసుకోవాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి.వివాహానికి ముందు తప్పనిసరిగా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవాలి. ప్రభుత్వం దాన్ని ప్రభుత్వం ఆమోదించాలో లేదో నిర్ణయిస్తుంది.ఎవరైనా విడాకులు తీసుకొని... మళ్లీ పెళ్లికి రెడీ అయితే... వారు 6 నెలల దాకా పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని డైరెక్టర్ మేజర్ జనరల్ అస్సాఫ్ అల్ ఖురేషీ తెలిపారు.దరఖాస్తు పెట్టుకునేవారి వయస్సు 25 ఏళ్లు దాటి ఉండాలి.దరఖాస్తు పై ముందుగానే స్థానిక జిల్లా మేయర్ సంతకం పెట్టి ఉండాలి.గుర్తింపు పత్రాలు (ఐడీ కార్డులు), ఫ్యామిలీ కార్డు కాపీ వంటివి సమర్పించాల్సి ఉంటుంది.
ఇక దరఖాస్తు చేసుకునే వ్యక్తికి అప్పటికే వివాహం అయితే అతడు తన భార్యకు సంబంధించి వికలాంగురాలని లేదా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుందని..లేదా ఆమె మానసిక ఆరోగ్యం సరిగా లేదని డాక్టర్ సర్టిఫికెట్ తప్పని సరిగా సమర్పించాలని తాజా ఆదేశాలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







